రాజమండ్రి రూరల్: ఈవెంట్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

84చూసినవారు
రాజమండ్రి రూరల్ సమీపంలోని వేమగిరిలో గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం పరిశీలించారు. కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌తో కలిసి చేపట్టిన భద్రతా ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. ఈవెంట్‌కు భారీగా అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ప్రతిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. అభిమానులు జాగ్రత్తలు పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్