తూర్పు గోదావరి జిల్లాలో 0-6 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన పిల్లలకి ఆధార్ నమోదు కార్యక్రమానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఆదివారం తెలిపారు. జిల్లాలో సుమారు 17, 000 మంది పిల్లలు వివిధ కారణాలవల్ల ఆధార్ సంఖ్య లేని వారు ఉండే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగిందన్నారు. సోమవారం నుంచి 10వ తేదీ వరకు 0-6 మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు.