రాజమండ్రిలోని గామన్ బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. రాజమండ్రిలో ఎన్‌హెచ్ అధికారులు, గామన్ బ్రిడ్జి మెయింటెనెన్స్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. బ్రిడ్జి రోడ్డును ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలని, గోతులు లేకుండా చూడాలని, రోడ్డుకు ఇరువైపులా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలన్నారు.