చిన్నపాటి వర్షానికే ముంపుకు గురయ్యే కడియం మండలం కడియపులంక పాత పూల మార్కెట్ రోడ్డుకు మోక్షం వచ్చింది. వర్షం వచ్చినప్పుడు నీరు కాలువలోకి వెళ్లడంలో జాప్యం జరగడం వల్ల ముంపు తప్పేది కాదు. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్ఆర్‌జిఎస్ నిధుల నుంచి రూ. 34 లక్షలు మంజూరు చేయించారు. ఆ నిధులతో 175 మీటర్ల పొడవుగల ఈ రోడ్డును ఆరు మీటర్లు వెడల్పుతో నిర్మించారు.