ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో పనిచేసి నలుగురికి సహాయపడాలని కడియం సర్దార్ కాటన్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లు పోలరాజు అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అసోసియేషన్ కార్యాలయం వద్ద కార్యవర్గ సభ్యులు, రైతులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన మహర్షి సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.