ఆహార భద్రతపై అవగాహన పెంచుకోవాలని, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలని నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య సుధాకర్ అన్నారు. మంగళవారం రాజానగరంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ‘ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్- స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిసారం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.