కోరుకొండ మండలం రాఘవపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు నూకతట్టి శివ ఆధ్వర్యంలో వైసీపీ 9వ వార్డ్ మెంబెర్ కలవల బుజ్జి తన అనుచరులతో కలిసి మంగళవారం జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి పార్టీలోకి చేరినట్లు వారు వెల్లడించారు.