కోరుకొండ మండలం కోటిలో రీ సర్వే పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కోరుకొండలో రీ సర్వే పురోగతి, రికార్డుల నిర్వహణపై సమీక్షించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను, మార్గదర్శకాలు మేరకు సమయపాలన పాటించాలని సూచించారు. రీ సర్వేలో అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించి అర్జీదారులు సంతృప్తి చెందేలా చూడాలని అన్నారు.