కోరుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన పాఠ్య, నోటు పుస్తకాలను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, నాయకులు పాల్గొన్నారు.