ఎంపీడీవోల సమీక్ష సమావేశం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గంలో త్వరితగతిన రోడ్లు పూర్తి చేయాలని అన్నారు. స్మశానవాటికలను శుభ్రం చేసి, అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. రోజువారి పని చేసుకునే పేద ప్రజలకు ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ని రూపొందించాలని ఎమ్మెల్యే అన్నారు.