రాజానగరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కార్యాచరణపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజానగరం ఎంపీడీవో ఝాన్సీ, కోరుకొండ ఎంపీడీవో అశోక్ కుమార్ తో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కొత్తగా చేపట్టవలసిన రోడ్లు నిర్మాణాలపై చర్చించి సూచనలు ఇచ్చారు. అలాగే నియోజవర్గంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందించాలన్నారు.