మహిళల ఆర్థిక ఎదుగుదల కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం అన్నారు. ఈ సందర్భంగా రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ఉచిత కుట్టుమిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. నియోజకవర్గానికి 10 కుట్టు మిషన్ కేంద్రాలని మంజూరు చేయడం జరిగిందని, మహిళలు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే అన్నారు.