ఉ. గో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపే లక్ష్యంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం ప్రచార కార్యక్రమాన్ని రాజానగరంలో ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యావంతుల ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని రాష్ట్ర భవిష్యత్తును రక్షించేందుకు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.