సీతానగరం మండలం చిన్న కొండెపూడి పరిధి రాజుపాలెం ఎస్సీ పేటలో డ్రైనేజీ నీళ్లు పోవడానికి మురికి కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వర్షాలు వచ్చినపుడల్లా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నీరు పోవడానికి ఎటు దారి లేక ఇళ్ల ముందే ఆగుతున్నాయని వాపోతున్నారు. అధికారులకు ఎన్నో సార్లు సమస్యను వివరించిన వినడం తప్ప ఎలాంటి చర్యలు లేవని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.