సీతానగరం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు వలవల రాజా అనారోగ్యంతో బాధపడుతూ రాజమండ్రిలోని ఓ ఆస్పత్రి నందు చికిత్స చేయించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆయనను బుధవారం పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.