వైద్యాధికారిణి టి.దివ్య శ్రీ ఆణ్వర్యంలో డెంగీ దోమలు, జ్వరము గురించి శుక్రవారం అవగాహన కల్పించారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ముక్కామల పిహెచ్‌సి ఆధ్వర్యంలో జాతీయ డెంగీ దినోత్సవం ర్యాలీ, అవగాహనా కార్యక్రమాలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైద్యాధికారిణి దివ్య శ్రీ మాట్లాడుతూ డెంగీ వైరస్ జ్వరాలు ఇంటి పరిసరాలలో ఉండే మంచి నీటి నిల్వల్లో పెరిగే ఎడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. కావున వారం రోజుల లోపులో ఈ నీటి నిల్వలను తొలగించడం లేదా దోమ లార్వా నిర్మూలించడం ద్వారా డెంగీ వైరస్ జ్వరాలు నివారించవచ్చన్నారు.