మలికిపురం మండలం లక్కవరం సెంటర్ నుంచి శంకరగుప్తం వెళ్లే చింతలపల్లి ప్రధాన ఛానల్ పై ఉన్న వంతెన రక్షణ గోడ లేక ప్రమాదకరంగా మారిందని లక్కవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రుద్రరాజు గోపాలకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆర్ అండ్ బీ అధికారుల దృష్టికి గతంలోనే తీసుకువెళ్లామన్నారు. శుక్రవారం ఈ వంతెన పైనుంచి పడి యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించాలని కోరారు.