మామిడికుదురు: సమస్యలు పరిష్కరించాలంటూ మహిళల ఆందోళన

81చూసినవారు
మామిడికుదురు: సమస్యలు పరిష్కరించాలంటూ మహిళల ఆందోళన
మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామ పరిధిలోని జగ్గన్నపేటలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక మహిళలు శనివారం ఆందోళన చేశారు. తాటిపాక నుంచి వచ్చే పైప్ లైన్ తరచూ పాడైపోయి సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. మొగలికుదురు ఉన్నత పాఠశాల వద్ద ఉన్న వాటర్ ట్యాంకును తొలగించారని అక్కడ బోర్ ఏర్పాటు చేసి దానిద్వారా తాగునీరు అందించాలని కోరారు. దానిని చేరుకొని ఉన్న చెరువును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్