సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తీర్థ మహోత్సవాల్లో అన్నదానాలు ఇక్కడి ప్రత్యేకత. లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం సందర్భంగా కులాలు, సేవా సంఘాల పేర్లతో ఉచితంగా భోజనం అందిస్తుంటే, అరవపాలెం గ్రామానికి చెందిన చిరు పవన్ కళ్యాణ్ స్వచ్ఛంద సంస్థ మెగాస్టార్ చిరంజీవి పేరుతో నిర్వహిస్తున్న అన్నదాన సత్రానికి 28సం. మంచి గుర్తింపు ఉంది. ఇందుకు చీరంజీవి అభినందనలు తెలిపినట్లు ఆదివారం వారు వివరించారు.