శివకోడు జాతీయ రహదారిపై సోమవారం పెట్రోల్ స్కూటీ దగ్ధమైంది. తల్లి, కూతురు నగరం గ్రామం నుండి మేడిచర్ల పాలెం గ్రామం వెళ్తూ ఉండగా శివకోడు వచ్చేసరికి స్కూటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఐదు నెలల క్రితం నూతన వాహనాన్ని కొన్నామని, ఇంతలోనే ఇలా జరిగిందంటూ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.