పట్టుభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు కాకినాడ జిల్లా నుంచి అత్యధిక మెజార్టీ అందించాలని ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జాబాబురావు, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుని మండలం తేటగుంట ప్రాంతంలో కూటమినేతలు పర్యటించారు. ప్రజలకు ఎలక్షన్ కు సంబంధించిన ప్రత్యేక కర్రపత్రాలు పంపిణీ చేస్తూ ముందుకు వెళ్లారు.