తుని పట్టణంలో కూటమి నాయకులు స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ యనమల దివ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూరతో భారత సైన్యం ప్రపంచానికి తన సత్తా చాటిందని తెలిపారు. తీవ్రవాదులపై జరిగిన పోరులో విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సైనికుల నిస్వార్థ దేశ సేవను కొనియాడారు. రాజా గ్రౌండ్ వద్ద నుంచి గొల్ల అప్పారావు సెంటర్ వరకు ర్యాలీ సాగింది.