తుని మండలం గవరయ్య కోనేరు జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి విజయనగరం వెళ్తున్న కోడిగుడ్లు వ్యాన్ ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా స్థానికులు క్లీనర్ తుని ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. సంఘటన స్థలానికి తుని రూరల్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.