తుని మండలం తేటగుంటలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ నెల 27న జరిగే పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఓటు వేసి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు.