ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో సోమవారం రాత్రి బూత్ కన్వీనర్లతో ఆయన సమావేశమయ్యారు. ఓటర్ వెరిఫికేషన్ వంటి అంశాలపై చర్చించారు. టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, వెలగా కృష్ణారావు పాల్గొన్నారు.