ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన కోనేటి ఆదిమూలంపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈ వీడియోపై ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన స్పందించారు.అది మార్ఫింగ్ వీడియో అన్నారు. పార్టీలో కొందరు తనకు గిట్టని వాళ్లే ఇలా మార్ఫింగ్ వీడియో పెట్టి తనను ఇరికించారని వాపోయారు. దీనిపై అధిష్టానానికి తగిన వివరణ ఇస్తానని చెప్పుకొచ్చారు. ఇది తన నియోజకవర్గంలో కొందరు టీడీపీ నేతల పనే అని తేల్చేశారు.