ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడంతో ఘంటసాల మండలంలో శుక్రవారం సాయంత్రం వేడుకలు నిర్వహించారు. మండల పరిధిలోని సూరపనేనివారిపాలెంలో గ్రామస్తులు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బొకినాల కృష్ణ మాట్లాడుతూ, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం పట్ల తల్లులు ఆనందంగా ఉన్నారని తెలిపారు.