కోడూరు రత్నకోడు మేజర్ డ్రైన్ లో వల కట్లను తొలగించాలని ఆక్వా రైతులు బుధవారం కోరారు. కోడూరు చినగుడు మోటు, జరుగువాని పాలెం, గ్రామాల సమీపంలో పరదాలు కట్టి వలకట్లు వేయుట కారణంగా కలుషిత మురుగునీరు సముద్రంలోకి వెళ్లకుండా నిలిచిపోతుందని రైతులు వాపోతున్నారు. దీని కారణంగా ఆక్వా సాగుకు ఇబ్బంది కలుగుతుందని తెలుపుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రత్నకోడులోని వలకట్లను తొలగించాలని కోరుతున్నారు.