కోడూరు పంచాయతీ కార్యాలయం సమీపన శిథిలావస్థకు చేరిన రామకృష్ణాపురం బస్సు షెల్టర్ ను మరమ్మత్తులు చేసి బుధవారం కోడూరు గ్రామ సర్పంచ్ వెన్నా షైనీ పున:ప్రారంభించారు. రామకృష్ణాపురం గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు మరమ్మత్తులు చేయించి రామకృష్ణాపురం ప్రజల ఆధ్వర్యంలో పునర్ ప్రారంభించినట్లు తెలిపారు. నాలుగు లక్షలు 15వ ఆర్థిక సంఘ నిధులతో బస్సు షెల్టర్ సమీపంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు.