విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు. మచిలీపట్నం వైపు వెళ్తున్న ఆటో బోల్తా కొట్టడంతో విజయవాడ వాంబేకాలనీకి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న గూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.