ముస్లిం సోదరులు ఉన్నత స్థితికి ఎదగాలి

52చూసినవారు
ముస్లిం సోదరులు ఉన్నత స్థితికి ఎదగాలి
అల్పదాయ వర్గాలకు చెందిన ముస్లిం సోదరులు ఉన్నత స్థానానికి చేరుకోవాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. అవనిగడ్డలో గురువారం ముస్లింల పెద్ద పండుగ ఈదుల్ ఫితర్ పండుగ సందర్బంగా ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హిందూ-ముస్లిం సమైక్యతకు అవనిగడ్డ ప్రతీక అన్నారు. ముస్లింలు, హిందువులు మతాతీత భావనతో, ఎలాంటి తారతమ్యాలు లేకుండా రెచ్చగొట్టే వారిని పట్టించుకోకుండా సమైక్యంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్