ముస్లిం సోదరులు అత్యంత పరమ పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ చల్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి తోట కనకదుర్గ స్మశాన వాటిక ప్రహరీ నిర్మాణానికి విరాళం అందించారు. చల్లపల్లి పంచాయతీలోని నారాయణరావు నగర్ లోని మసీదులో గురువారం కనకదుర్గ రూ. 10, 116లను అందజేశారు. నారాయణరావు నగర్ లో ఏర్పాటు చేయనున్న ముస్లిం ప్రహరీ గోడ నిర్మాణంకు సాయం అందించిన దాతను ముస్లింలు అభినందించారు.