నాగాయలంక మండలంలో జనసేన పార్టీ ద్వారా మెజారిటీ ఓట్లు సాధిస్తామని మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకులు అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కి హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం బుద్ధప్రసాద్ ఇంటివద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నాగాయలంక మండలానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ గెలుపుకు పని చేస్తామని తెలిపారు.