చింతలపూడి ప్రాంతంలో ఉన్న బొగ్గు నిల్వలను వెలికి తీసి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు తొర్లపాటి రాజు ఆదివారం అన్నారు. ఈనెల 6 నుంచి 8 వరకు జరిగిన ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై చర్చించామన్నారు. చింతలపూడి ప్రాంతంలో బొగ్గు నిల్వలను వెలికి తీయాలని తీర్మానం చేసినట్లు రాజు తెలిపారు.