ఘంటసాల మండలం పాపవినాశనం డొంక నుంచి భారీగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుండగా, గురువారం రాత్రి రెవిన్యూ ఉద్యోగులు 8 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. వాటిని ఘంటసాల తహసీల్దార్ కార్యాలయంకు తరలించారు. 5 ట్రాక్టర్లు కార్యాలయంకు తరలించగా, మూడు ట్రాక్టర్ల డ్రైవర్లు పారిపోవటంతో టైర్ల గాలి తీసారు. తహసీల్దార్ విజయప్రసాద్ ఆదేశాల మేరకు ట్రాక్టర్లు అదుపులోకి తీసుకున్నారు.