హైకోర్టు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి కుటుంబ సమేతంగా శనివారం ఉదయం, బాపులపాడు మండలంలో హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి వెంకట జ్యోతిర్మయి దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు.