గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ రూరల్ మండలాల్లోని ప్రధాన రహదారుల పరిస్థితి అధ్వానంగా మారడంతో వర్షం వస్తుందంటేనే భయపడాల్సిన పరిస్థితులు దాపురించాయి. వైసిపి ప్రభుత్వంలో ప్రధాన రహదారులపై పడిన గోతులలో రబ్బిష్ కూడా పోయికపోవడంతో ఇటీవల కాలంలో వరసగా కురుస్తున్న వర్షాలకు ఆ గోతులు మరింత పెద్దవై ప్రమాదాలకు దారితీస్తున్నాయి.