పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన షేక్ అబ్దుల్ కరీమ్ ని వైసీపీ ఇటీవల కృష్ణా జిల్లా ట్రేడ్ వింగ్ సెక్రటరీగా నియమించింది. పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ దేవభక్తుని చక్రవర్తిని ఆయన కార్యాలయంలో కరీమ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కరీమ్ ని అభినందించి వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని చక్రవర్తి ఈ సందర్భంగా అన్నారు.