గుడివాడ మండలం మల్లాయిపాలెం మెయిన్ రోడ్డులో ఎస్ఐ నంబూరి చంటిబాబు శుక్రవారం వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న చలానాలను తక్షణమే చెల్లించాలని వాహనదారులకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.