గుడివాడలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ

79చూసినవారు
స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గుడివాడ నైజాంపేటలో గురువారం సంతకాల సేకరణ చేపట్టారు. స్మార్ట్ మీటర్లు వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియను నిలుపుదల చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్ సీపీ రెడ్డి, ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు అమీర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్