జగ్గయ్యపేట పట్టణంలో గురువారం ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. మున్సిపల్ పరిధిలోని శాంతినగర్, విష్ణు ప్రియ నగర్ లో 150 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాత) ఎగురవేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఎంతోమంది వీరుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రాన్ని సాధించుకున్నామని వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు.