కృష్ణాజిల్లా మచిలీపట్నం మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ ఆర్ అండ్ బి అతిథి గృహంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసింది తన హయాంలోనే తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాటప్రకారం తను పోటీ నుండి తప్పుకోవలసిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. తాను పోటీ చేయకపోయినా తన మద్దతు ఉమ్మడి పార్టీ అభ్యర్థులకు ఉంటుందని తెలిపారు.