దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి చంద్రబాబు రుజువు చేశారని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ అన్నారు. బుధవారం మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 1997 సంవత్సరంలో నాటి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై విడుదల చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసిందని తెలిపారు. ప్రస్తుతం ఎస్సి ఉప వర్గీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలపడం హర్షణియమన్నారు.