మచిలీపట్నంలో తెలుగు మహిళలు బస్టాండ్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మంగళవారం సాయంత్రం నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలను కించపరిచిన సాక్షి మీడియాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యూస్ పేపర్ ను దహనం చేశారు. రాజకీయ లబ్ధి కోసం మహిళలపై వైసీపీ వెకిలి చేష్టలు చేస్తుందని పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం మహిళలు లంకి శెట్టి నీరజ, పాలపర్తి పద్మజ మండిపడ్డారు.