మచిలీపట్నం: కార్మికుల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎన్నిక

57చూసినవారు
మచిలీపట్నం: కార్మికుల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎన్నిక
అఖిలభారత అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ జిల్లా చైర్మన్ గా కృష్ణాజిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన షేక్ అయ్యూబ్ ను అధిష్టానం ఆదివారం ఖరారు చేశారు. షేక్ అయ్యూబ్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా ద్విచక్ర వాహనాల సీనియర్ మెకానిక్ గా పనిచేస్తున్నారు. కార్మిక సంఘంలో మంచి గుర్తింపు పొందిన నాయకునిగా కొనసాగుతున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలిపారు

సంబంధిత పోస్ట్