పేదల సంక్షేమం, ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మైలవరం శాసనసభ్యులు వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
గురువారం జి. కొండూరులోని వెలగలేరు, కవులూరుల్లో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. జి. కొండూరు మండల వ్యాప్తంగా 8728 మంది లబ్ధిదారులకు రూ. 3, 67, 92, 0 00లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. 95 శాతానికి పైగా పింఛన్ల సొమ్ము లబ్ధిదారులకు చేరిందన్నారు.