కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో మాజీ ఐఆర్ఎస్ ఉప్పులేటి దేవిప్రసాద్ సోమవారం విజయవాడలోని ఆంధ్ర రత్న భవనంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి కలిసి పార్టీలో చేరారు. షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆయనను ఆహ్వానించారు. దేవి ప్రసాద్ సతీమణి ఉప్పులేటి కల్పన గతంలో పామర్రు శాసనసభ్యురాలుగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ ఇన్చార్జ్ శొంఠి నాగరాజు పాల్గొన్నారు.