పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో గురువారం నందు మన ఇంటికి మన కైలే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ పాల్గొని ప్రతి ఇంటిని సందర్శించారు.
మన ఇంటికి మన కైలే కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా కలిసి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి శాసనసభ్యుడిగా నన్ను మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా సింహాద్రి చంద్రశేఖర్ ని గెలిపించాలని కోరారు.