త్రాగునీటికి ప్రథమ ప్రాధాన్యతని ఇవ్వటం జరుగుతుందని బొడ్డపాడు గ్రామ సర్పంచ్ మూడే శివశంకరరావు తెలిపారు. తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పల్లపు కాలువ వద్ద రైతులకు తాగునీటి అవసరాల నిమిత్తం మండల పరిషత్ నిధులతో నిర్మించనున్నటువంటి డబ్బా పంపు నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజానీకానికి మంచినీటిని అందించడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు.