కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

79చూసినవారు
అర్హులైన కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ కోరారు. తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు గ్రామంలో శుక్రవారం ఏరువాక కార్యక్రమంలో ఆయన మేడి పట్టి పొలం దున్నే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు సకాలంలో ఖరీఫ్ సాగు సంబంధించిన విత్తనాలను అందించాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. పలు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్